02-01-2026 12:11:43 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జనవరి ౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు అధికారులు ప్రజలు మరింత కష్టపడి పని చేయవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ తో పాటు, రెవెన్యూ, పంచాయతీ, జిల్లా పరిషత్, విద్య, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ, ఖజానా, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక, పౌర సరఫరాల, యువజన క్రీడల, భూ కొలతల శాఖల అధికారులు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.