calender_icon.png 20 January, 2026 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో భూతగాదాలతో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య

19-09-2024 04:06:43 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో భూతగదలతో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ కలవేన సాయికృష్ణ తండ్రి రాజేశం(60) ను భూతగదంలో ఆగ్రహంతో ఉన్న తన పాలోల్లే గురువారం సదారుణంగా హతమార్చారు. రాజేశం తన పోలం వద్దకు పోతున్నాను అని ఇంట్లో చెప్పి ఇంటి నుంచి పోయిన రాజేశం ను పాలోల్లే మాటువేసి  దారుణంగా బండరాయితో కొట్టి హతమార్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ గజ్జి కృష్ణ,  సీఐ, ఎస్ఐ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.