06-10-2025 12:27:36 AM
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల ఉపా ధ్యాయుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లుగా ఉండాలని, విద్య, ఉపాధ్యాయు ల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో చాలా కాలంగా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేష్ తెలిపారు.
అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంగ్, అఖిల భారతీయ కార్యనిర్వాహక, సర్వసభ్య సమావేశం ఆదివారం జైపూర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఏడవ వేతన సంఘం సిఫార్సులను దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.