calender_icon.png 2 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలల్ని అణచివేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్

02-09-2025 12:49:26 AM

-రోస్టర్ పాయింట్లను సవరించాలి

-లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం..

-మాల ఐక్య సంఘాల డిమాండ్

ముషీరాబాద్,  సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణను అసంబద్ధంగా, అస్తవ్యస్థంగా చేసి రోస్టర్ పాయింట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాల, మాల అనుబంధ కులాల గొంతు కోసి అన్యాయం చేసిందని నేషనల్ అంబేద్కర్ సేన, మాల ఐక్య సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశాసిన మీడియా సమావేశంలో నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షులు మన్నే శ్రీధర్ మాట్లాడారు. మంద కృష్ణ మాదిగ చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు.

రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు తీవ్రమైన నష్టం చేశాడని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసి మాలలకు న్యాయం చేయాలన్నారు. మాల పొలిటికల్ జేఏసీ చైర్మన్ డా.మంచాల లింగస్వామి మాట్లాడుతూ రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాదిగల మెప్పు కోసం మాల, మాల అనుబంధ, మాదిగ అనుబంధ కులాలైన 58 కులాల హక్కులను, అవకాశాలను హరించారని అన్నారు. జీవో. 10, 99 లను సవరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్తామన్నారు. మాలలకు అన్యాయం జరుగుతున్నా అసెంబ్లీలో గొంతెత్తని మాల మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను త్వరలో ముట్టడిస్తామని హెచ్చరించారు.

జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ర్ట అధ్యక్షులు కరణం కిషన్, నేషనల్ అంబేద్కర్ సేన రాష్ర్ట అధ్యక్షులు తాలుకా రాజేష్, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ యూత్ ప్రెసిడెంట్ దాసరి విశాల్, జై భీమ్ మహిళా సంఘం అధ్యక్షురాలు సుధామల్ల అంజలీ, సల్లా పవన్, నర్మెట్ట మల్లేష్, దళిత హక్కుల రక్షణ సంఘం అధ్యక్షురాలు మంగ, భుజంగ రావు, గిరిజా శంకర్, సయ్యద్ అస్లాం, జూల విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.