02-09-2025 12:50:46 AM
-జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా పౌర సమాజం నిలబడాలి
-రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల అభిప్రాయం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): ఉప రాష్ర్టపతి ఎన్నిక వ్యక్తికీ, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ అని, ఎంపీలు ఎటువైపు నిలబడతారో ఆలోచించాలని టైం టేబుల్ సమావేశంలో వక్తలు కోరారు. సోమవారం సీనియర్ పాత్రికేయులు ఎం ఎం రహమాన్ అధ్యక్షతన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ పౌర సమాజం తరపున పార్లమెంట్ సభ్యులందరికీ లేఖలు సైతం రాస్తామని తీర్మానించారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సల్వాజుడుం అనే ప్రైవేటు సైన్యాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఆదివాసీలను లెక్కలేని విధంగా హత్యచేశారని విమర్శించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ దేశ ప్రజల హక్కులను కాపాడేది సుప్రీంకోర్టు మాత్రమేనని రిటైర్డ్ జడ్జి జస్టి చంద్రకుమార్ అన్నారు. సుదర్శన్‌రెడ్డి జనజీవన స్రవంతిలోనే ఉన్నారని - దేవులపల్లి అమర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం కోర్టు తీర్పు ఇచ్చిందని కోదండరాం అన్నారు.