calender_icon.png 9 August, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

09-08-2025 12:34:52 AM

 అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్

పెబ్బేరు/ శ్రీ రంగాపురం, ఆగస్టు 8 :  భూ భారతి రెవెన్యూ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు, శ్రీరంగపూర్ తహసీల్దార్ కార్యాలయాల్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. కార్యాలయ సమయానికి ఆలస్యంగా వచ్చే ఉ ద్యోగులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ’భూభారతి’ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికి కార్యాల యానికి హాజరు కావాలని, కార్యాలయ క్రమశిక్షణను పాటించాలని సూచించారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే, రికార్డు గదిలోని రికార్డులను సక్రమంగా, భద్రంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

అంతకుముందు పెబ్బేరు లోని సత్యసాయి రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రబీ 2024-25 సీజన్ కు సంబంధించి ఎఫ్ సి ఐ కి సమర్పించవలసిన సిఎంఆర్ బియ్యాన్ని వేగంగా అందించాలని మిల్లర్లను ఆదేశించారు. ప్రతిరోజు ఒక ఏసీకే ధాన్యాన్ని సమర్పించాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.