calender_icon.png 9 August, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన బస్టాండ్ నిర్మాణం కోసం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

09-08-2025 12:35:22 AM

యాదాద్రి భువనగిరి ఆగస్టు 8 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శుక్రవారం సెక్రటేట్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బస్టాండ్ లోతట్టు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో చిన్నపాటి వర్షాలకు సైతం చెరువులను తలపించే విధంగా వరదనీరు చేరుకొని బస్సులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది జరుగుతుందని అని  తెలిపారు.

గత 40 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన బస్టాండు. పెరిగిన ప్రయాణికులు, వసతులు, బస్సులు నేపథ్యంలో సరిపోవడంలేదని వివరించారు.  నియోజకవర్గంలో పలు గ్రామాలకు బసౌకర్యాలు లేక ప్రజలు విద్యార్థులు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే నూతన బస్ సర్వీసులను ప్రారంభించాలని కోరగా మంత్రి సానుకూలంగా  స్పందించారు.