18-09-2025 12:37:40 AM
- అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజా పాలన ది నోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు పోలీసుల నుండి గౌ రవ వందనం స్వీకరించిన ఆయన, జిల్లా ప్ర గతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అ న్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజికన్యాయం, స మాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ ల క్ష్యం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుందన్నారు. జిల్లాలో ఇప్పటికి దాదా పు 2.45 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు. మహిళలకు 114.62 కోట్ల రూపాయల లబ్ధి చేకూ రిందన్నారు.
జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధి కారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషిచేస్తున్న పోలీసు యంత్రాం గానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, మీడియా మిత్రులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ.. జిల్లాను అభివృద్ది పథంలో నిలపటానికి మీ అందరి స హకారాన్ని ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నా రు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస రెడ్డి,జె.అనిరుధ్ రెడ్డి, జి.మధు సూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనితా మధు సూదన్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాద వ్,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్.పి .డి.జానకిస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శి వేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ నుగు నర్సింహ రెడ్డి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి
వనపర్తి, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన ది నోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వనపర్తి జిల్లాలోని ఐ.డి.ఓ.సి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి పోలీస్ శాఖ ద్వారా ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ శాఖ ల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను చదివి వినిపించారు. వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖివెన్యూ నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వర రావులుపాల్గొన్నారు.