calender_icon.png 22 July, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాసమితి సభ్యులతో సమీక్ష సమావేశం

26-05-2025 08:24:51 PM

ఇల్లెందు (విజయక్రాంతి): జూన్ 2న జెకె కాలనీలోని బ్లాక్ డైమండ్ స్టేడియం నందు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సేవా అధ్యక్షురాలు వి.రమ తెలిపారు. సోమవారం సింగరేణి సేవా సమితి సభ్యులతో వై.సి.ఓ.ఎ క్లబ్ నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ... జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా సింగరేణి యాజమాన్యం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా స్టాల్స్, తెలంగాణ పరుగు  మొదలగు వాటిలో సేవా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు, సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్, సేవా కార్యదర్శి సులక్షణ  ఇతర సేవా సమితి సభ్యులు, సింగరేణి స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.