11-11-2025 01:39:11 AM
ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్లపై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు.
ఇది నాలుగు విభిన్న కాలాల అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించే సినిమా అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. పోర్చుగీస్ కాలంతో ప్రారంభమయ్యే ఈ కథ దేవలోకానికి మారడం, అక్కడ ఒక ప్రేమకథ.. తర్వాత రాజుల యుగంలో నడిచే మరో గ్రామీణ ప్రేమకథ, అనంతరం ఆధునిక కాలానికి కథ మారడం వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేమ, మైథాలజీ, పునర్జన్మ, పీరియడ్ డ్రామా ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా ఉందనేలా భారీ అంచనాలను నెలకొల్పిందీ ట్రైలర్.