30-01-2026 12:00:00 AM
తాడ్వాయి, జనవరి, 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎచ్ కె జి ఎన్ అనే రైస్ మిల్ విద్యుదాఘాతంతో బుధవారం రాత్రి దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. రైస్ మిల్లులో ఉన్నటువంటి విద్యుత్ తీగల సమస్ వల్ల విద్యుదాగాతానికి గురైందని తెలిపారు. ఈ ప్రమాదంలో రైస్ మిల్లులోని బియ్యము, తౌడు కాలిపోయాయి. దీంతో రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి బాధితుడికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.