calender_icon.png 30 January, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర

30-01-2026 12:00:00 AM

ఎల్లారెడ్డి, జనవరి 29, (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గురు వారం ఎల్లారెడ్డి మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, అభ్యర్థులుకు , ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా నామినేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, ఎల్లారెడ్డి పట్టణంలో శాంతిభద్రతల నిర్వహణ, బందోబస్తు చర్యలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ యస్. శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాజారెడ్డి, ఎల్లారెడ్డి ఎస్హెచ్‌ఓ మహేష్, ఎస్ ఐ. 2 సుబ్రమణ్య చారి మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.