08-05-2025 12:00:00 AM
భూపాలపల్లి, మే 7 (విజయ క్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే దశలో ఉండగా అకాల వర్షంతో నేల వాలింది. పంట పూర్తిగా నేలవాలి పోగా, కనీసం కాపాడుకునే సమయం ఇవ్వకుండా మళ్లీ వర్షం కురవడంతో రైతులు చేసేదేమీ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ క్రమంలో నేల వాలిన వరి పంట మొలకెత్తుతోంది. దీనితో యాసంగిలో సాగుచేసిన వరి పంట వర్షార్పణం అయ్యిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల ఇదే తరహాలో వరి పంట నీటిలో నాని మొలకెత్తుతోంది. గణపురం మండలం మోరంచ వాగు పరివాహక ప్రాంతంలో గొర్రె ప్రశాంత్ యాదవ్ అనే రైతు 5 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట నీటిపాలై.. మొలకెత్తుతోంది.