calender_icon.png 10 May, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల భద్రతకు భరోసా పెద్దపీట

08-05-2025 12:00:00 AM

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, మే 7(విజయక్రాంతి):మహిళలకు, బాలికల భద్రతకు భరోసా పెద్దపీట వేస్తుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. భరోసా 9వ ఆవిర్భావ ది నోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జి ల్లాలో భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎస్పీ హాజరైన మాట్లాడారు.

పొక్సో,  అత్యాచార కేసులలో భాదితురాలికి భరోసానిచ్చేందుకు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా 2016 మే 7వ తేదీన ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పొక్సో, అత్యాచార కేసులలో భాదిత మహిళల, బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటూ దేశానికే ఆదర్శం నిలుస్తుందని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో భరోసా సెం టర్ ప్రారంభమైన నాటి నుండి సత్పలితాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న భరోసా కో-ఆర్డినేటర్ దేవలక్ష్మీ, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా భాదిత మహిళలకు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున, 20 వేల చె క్కులను అందించడం జరిగింది.  కార్యక్రమంలో  మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రమీల, ఎస్‌ఐ పూలబాయ్, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.