calender_icon.png 17 January, 2026 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం

17-01-2026 02:39:33 AM

  1. లక్షెట్టిపేట వాసుల మృతి

మృత దేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలింపు

లక్షెట్టిపేట టౌన్, జనవరి 16 : కన్యాకుమారిలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొన్న ప్రమాదం లో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన దంపతులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది... వివరాల్లోకి వెళితే... లక్షెట్టిపేట పట్టణానికి చెందిన జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి(59) దంపతులు అయ్య ప్ప మాల ధరించి ఈ నెల 8న ఓ ప్రైవేట్ సర్వీసులో శబరిమలై దర్శనానికి వెళ్లారు.

ఈ నెల 15న మకర సంక్రాంతిన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారిలో సముద్ర స్నానం చేసి అక్కడున్న దేవాలయాలు సందర్శించి బస్సు ఎక్కేం దుకు గురువారం రాత్రి 9 గంటలకు సత్యనారాయణ, రమాదేవి దంపతులు బైపాస్ రోడ్డు దాటుతుం డగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని దంపతులు అక్కడిక క్కడే మృతి చెందారు. మృత దేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దంపతులిద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో లక్షెట్టిపేటలో విషాధచాయలు అలుముకున్నాయి.