calender_icon.png 17 January, 2026 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొయినాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

17-01-2026 02:37:31 AM

మున్సిపాలిటీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కాలే యాదయ్య

మొయినాబాద్ జనవరి 16(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కెపల్లి వార్డులో రూ.1 కోటి 17 లక్షల 90 వేల నిధులతో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మూర్తోజీగూడ వార్డులో రూ.1 కోటి 19 లక్షల 6 వేల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది.

సురంగల్ వార్డులో రూ.85 లక్షల 20 వేల నిధులతో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. అదేవిధంగా మొయినాబాద్ పట్టణంలో రూ.1 కోటి 90 లక్షల 20 వేల వ్యయంతో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దమంగళారం వార్డులో రూ.1 కోటి 92 లక్షల 60 వేల నిధులతో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. అప్పోజీగూడ వార్డులో రూ.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. చిలుకూరు వార్డులో రూ.1 కోటి 41 లక్షల నిధులతో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడితే ప్రజలకు మౌలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు. అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. 

మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహినుద్దీన్, మున్సిపల్ మేనేజర్ జమీల్, డి ఈ పురుషోత్తం రావు, టి పి సి సి కరవర్గ సభ్యులు షాబాద్ దర్శన్, మాజీ జెడ్పిటిసి కాలేజ్ శ్రీకాంత్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎంకేపల్లి అమర్నాథ్ రెడ్డి,

కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద మంగళారం మల్లారెడ్డి. రామకృష్ణ గౌడ్ హనుమంత యాదవ్ సరికొండఅనంతరెడ్డి మునగాల రవీందర్ రెడ్డి సురంగల్ గడ్డం వెంకట్ రెడ్డి జైపాల్ రెడ్డి ఈగ రవీందర్ రెడ్డి,భాస్కర్ చారి. యాదగిరి చారి, శ్రీశైలం యాదవ్, చంద్రయ్య, రమేష్, అశోక్ రెడ్,డి అధికారులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.