calender_icon.png 24 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు రక్షణకు ముందుకు రావాలి

24-08-2025 12:27:34 AM

-కాంగ్రెస్ నేత వీహెచ్

-అంబర్‌పేటలో ‘ఓటు చోరీ.. గద్దే చోడో’ 

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. దొంగ ఓట్లతో నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాలనే కుట్ర చేస్తున్నారని ఆయన మండపడ్డారు. ‘ఓటు చోరీ.. గద్దే చోడో’ అని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అంబర్‌పేట నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి బీజేపీ కుట్రలు తెలియజేశారు.

మోదీ, అమిత్‌షా కలిసి బీహర్‌లో 65 లక్షల ఓట్లను తగ్గించడం ఎంతవరకు సమంజసమని వీహెచ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి ప్రజల మన్ననలు పొం దిన నాయకుడన్నారు. రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయిగానీ, అర్హతగానీ బీజేపీ నాయకులకు, ప్రధాని మోదీకి, అమిత్‌షాకు లేదన్నారు. ఈసీతో బీజేపీ రహస్య ఒప్పందాన్ని రాహుల్ మీడియా ముందు వివరాలతో సహా బయటపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు అప్సర్ యూసుఫ్, లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్‌గౌడ్, పులి జగన్, దిడ్డి రాంబాబు, గరిగంటి రమేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.