calender_icon.png 4 November, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ అభివృద్ధి కోసమే రోడ్డు విస్తరణ

04-11-2025 12:44:22 AM

బెల్లంపల్లి, నవంబర్ 3 : బెల్లంపల్లి పట్టణం లో రోజురోజుకు జనాభా పెరగడంతో పాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నందున ప్రజల సౌకర్యార్థమే పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు పట్టణ కాం గ్రెస్ అధ్యక్షుడు ముచర్ల మల్లయ్య చెప్పారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు పాలకులు బెల్లంపల్లి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల అభివృద్ధిని పట్టించుకోని బీఆర్‌ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పాటు పట్టణ అభివృద్ధికి 23 కోట్ల రూపాయల నిధులు తీసుకువ చ్చారని  తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పుకు రూ 7  కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పట్టణాభివృద్ధికి తాజాగా మరో 18 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

కోట్లాది రూపాయల నిధులు తెచ్చి ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధి కీ కృషి చేస్తున్నారని మల్లయ్య పేర్కొన్నారు.ప్రధాన రహదారికి కాల్ టెకస్ట్ ఫ్లైఓవర్ నుంచి కాంట్రాక్ట్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు మూడు కోట్ల 70 లక్షలతో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణం రూ,, 50 లక్షల తో పోచమ్మ చెరువుపార్కుఅభివృద్ధి,పట్టణంలో రూ,, 2 కోట్లతో చౌరస్తాల అభివృద్ధి, ఏఎంసీ,మున్సిపల్,గాంధీ చౌరస్తా ల ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

మరో 50 లక్షలు కూరగాయల మార్కెట్ వద్ద పార్కింగ్ షెడ్ల ఏర్పాటు కోసం రూ. 50 లక్షలు, గాంధీచౌక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు  మురికి కాలువల నిర్మాణం మిగతా నిధులతో సిసి రోడ్ల నిర్మాణం చేపడతారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుముల శంకర్, కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షులు భూపెల్లి రాజేశ్వర్,కంకటి శ్రీనివాస్,  కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్,బండి రాము,అల్లం కిషన్, పోచంపల్లి హరీష్,డీ పీ సుందర్ తదితరులు పాల్గొన్నారు.