04-11-2025 12:45:34 AM
							సోయా కొనుగోళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, నవంబర్ ౩ (విజయ క్రాం తి): పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులకు సూచించారు. బేల, జైనథ్ మండల కేంద్రంల్లో సోమవారం సోయా కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.