01-11-2025 12:00:00 AM
బెల్లంపల్లి, అక్టోబర్ 31 : బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నుంచి మొదలుకొని కాంట అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ పనులను మున్సి పల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెండు వైపులా కలిపి 100 ఫీట్ల మేర రోడ్డును వెడల్పు చేయనున్నారు. చౌడేశ్వరి, ఏఎంసి, సిఎస్‌ఐ, పాత మున్సిపల్ కార్యాలయం, సింగరేణి స్టోర్, కాంటా, అంబేద్కర్ చౌరస్తా, పెద్ద కాలువ వరకు మొదటి దశలో ఈ రోడ్డు వెడల్పు పనులను చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న దుకాణాలను, ఫుట్ పాత్‌పై ఉన్న తాత్కాలిక షెడ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. జేసీబీ లతో రోడ్డుపై ఉన్న తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు. బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్త్స్రలు బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించారు.