23-09-2025 01:29:10 AM
ఇప్పటివరకు 12,276 గుంతల పూడ్చివేత
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు భద్రతా చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడంతో పాటు, నగరవ్యాప్తంగా గుంతల పూడ్చివేత పనులను ముమ్మరం చేసింది. పనులను పర్యవేక్షిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్..
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జీహెఎంసీ చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం నాటికి నగరంలో మొత్తం 14,631 గుంతలను గుర్తించగా, వాటిలో ఇప్పటికే 12,276 గుంతలకు మరమ్మతులు పూర్తి చేశారు.
కేవలం సోమవారం ఒక్కరోజే 95 గుంతలను పూడ్చివేసినట్లు అధికారులు తెలిపారు. గుంతల పూడ్చివేతతో పాటు, క్యా పిట్ మరమ్మతులు, మ్యాన్‌హోల్ కవర్ల మార్పిడి, సెంట్రల్ మీడియన్ల మరమ్మతులు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.