calender_icon.png 23 September, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి

23-09-2025 01:30:36 AM

డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించడమే ప్రథమ ప్రాధాన్యమని, ఆ దిశగా అధికారులు వేగంగా స్పందించాలని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించిన సువర్ణ.. డిప్యూటీ మేయర్‌ణు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో రోడ్లు, కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని సువర్ణకు దిశానిర్దేశం చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.