calender_icon.png 21 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ సేఫ్టీ ఉత్సవాలను విజయవంతం చేయాలి

21-12-2025 12:27:21 AM

ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్, వలంటీర్స్ బృందాలు

రవాణా శాఖ మంత్రి పొన్నం 

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గిం చి మరణాల రేటును నివారించడమే లక్ష్యం గా జనవరిలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో తీసుకోవాల్సిన కార్యాచరణపై శనివారం సచివాలయంలో సీఎస్ కే రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబరిదితో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ... ప్రమాదాలను నివారించడానికి ప్రజలకు జాతీయ రోడ్డు భద్రతా మాసో త్స వాలపై అవగాహ న కల్పించాలని సూచించారు.  రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహా యం అందించిన వాహనదారులను ప్రోత్సహించడానికి రహవీర్ గుడ్ సమర్థన్ స్కీమ్ ద్వారా 25 వేల క్యాష్ అవార్డుతో అం దించే పథకం రాష్ర్టంలో త్వరలోనే ప్రారం భం కానుందని తెలిపారు.   సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మ హేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎంజేపీ సెక్రటరీ సైదులు, నేషనల్ హైవేస్ అథారిటీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.