calender_icon.png 24 December, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 కోట్ల రూపాయలతో రోడ్ల ఆధునికీకరణ

24-12-2025 01:36:59 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

సుల్తానాబాద్ డిసెంబర్ 23 (విజయక్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి తహసిల్దార్ కార్యాలయం మీదుగా గట్టేపల్లి చౌరస్తా వరకు డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్, రెండు చోట్ల ఐలాండ్స్ నిర్మాణం చేపట్టి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధులు వెచ్చించి నూతనంగా నిర్మాణం చేపడుతున్న రోడ్డును స్థానిక నేతలతో కలిసి పరిశీలించి మున్సిపల్,ఇంజనీరింగ్ అధికారులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సూచనలు చేశారు...

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో ఇట్టి రోడ్డును ఆధునికరిస్తున్నట్టు తెలిపారు, అలాగే రెండు చోట్ల అంబేద్కర్ కూడలి, ఎంపీడీవో కార్యాలయ కూడలి లా వద్ద 50 లక్షలతో ఐలాండ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా తారు రోడ్డు నిర్మాణం చేపట్టి దశలవారీగా డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేపడుతామని అనంతరం ఐలాండ్స్ ఏర్పాటు.

చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ రమేష్ , నాయకులు షాయరీ మహేందర్ , గాజుల రాజమల్లు, అబ్బయ్య , ముత్యాల రవీందర్, పన్నాల రాములు, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), అమ్మిరీశెట్టి తిరుపతి, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.