calender_icon.png 24 December, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైస్తవ సోదరులు సమాజసేవకు పునరంకితం కావాలి

24-12-2025 01:35:11 AM

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

మానకొండూరు, డిసెంబర్ 23( విజయక్రాంతి )సమాజంలో శాంతిని, సర్వమానవ సమానత్వాన్ని నెలకొల్పేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మానకొండూర్ మండల కేంద్రంలోని వేడుక మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి, ప్రేమ, దయ, కరుణ అందించిన క్రీస్తు మార్గం అనుసరణీయమైనదన్నారు.

ఇప్పటికే క్రైస్తవ సంఘాలు సమాజసేవలో కీలకంగా వ్యవహరిస్తాయని ఆయన కొనియాడారు. విద్యాసంస్థలు, ఆస్పత్రులను నెలకొల్పి ప్రజలకు మెరుగైన సేవలందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అనంతరం క్రైస్తవ మతపెద్దలు, పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో తహసీల్దార్లు సురేఖ(శంకరపట్నం),కర్ర శ్రీనివాస్ రెడ్డి (తిమ్మాపూర్), కనకయ్య (గన్నేరు వరం), మానకొండూర్ ఉప తహసీల్దార్ సమ్మయ్య,

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్,వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మామిడి అనిల్ కుమా ర్, వెల్ది,మద్దికుంట,బంజేరుపల్లి,చెంజర్ల, ఈదులగట్టెపల్లి గ్రామాల సర్పంచులు పెంచాల కిషన్ రావు, బుర్ర శ్రీధర్, తోట లత-శ్రీనివాస్, గొల్లెన కనకవ్వ-కొమురయ్య,మీస సత్యనారాయణ, కన కం సంపత్, పార్టీ నాయకులు రామిడి శ్రీనివాస్ రెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, మడుపు ప్రేమ్ కుమా ర్, కోండ్ర సురేష్, ఇర్ఫాన్, కనకం అశోక్,బక్కారెడ్డి,నాగిశెట్టి రాజయ్యతోపాటు పలువురు పాసర్లు, క్రైస్తవ సోదరసోదరీమణులు తదితరులు హాజరయ్యారు .