calender_icon.png 22 December, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం దుకాణంలో దోపిడీ

22-12-2025 12:19:21 AM

బోధన్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో దొంగలు రెండు బంగారం దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజాము ఈ దోపిడీ జరిగిన టు తెలుస్తోంది. బోధన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న శివ గోల్డ్ సిల్వర్ మర్చంట్ దుకాణాల్లో పెద్ద ఎత్తున  చోరీ జరిగినట్టు తెలుస్తోంది. దోపిడీకి పాల్పడ్డ దొంగలు షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణంలోకి  చొరబడి దోచుకున్నారు. ఈ దోపిడీలో ముగ్గురు వ్యక్తులు చోరీ కి పాల్పడినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు ల ద్వారా గుర్తించారు. బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ  ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.