22-12-2025 12:18:16 AM
డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, డిసెంబరు 21 (విజయ క్రాంతి): ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును బిజెపి తొలగించిందని, ప్రజల మనసుల నుండి మహాత్మా గాంధీ పేరును ఎవ రు తొలగించలేరని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త పథకాన్ని బీజేపీ తెస్తుండడానికి నిరసిస్తూ ఆదివారం నగరంలోని కార్ఖానా గడ్డ గాంధీ రోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాం గ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చే పట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని ఎ లాంటి మార్పులు చేసినా సహించబోమని హెచ్చరించారు.
నాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకానికి మ హాత్మా గాంధీ పేరును పెట్టడం జరిగిందని, సత్యం అహింస ద్వారా ఈ దేశానికి స్వా తంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ చూపించిన మార్గాన్ని ప్రపంచంలోని అనేక దేశాలలో ఒబామా, నెల్సన్ మండేల లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ స్ఫూర్తితో వారు చూపిన మార్గాన్ని ఎంచుకొని ఆ దేశాలకు స్వతంత్రాన్ని తీసుకువచ్చిన చరిత్ర ఉందన్నారు.
బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి స్వా తంత్రాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాం ధీ అని, ఉన్నత కుటుంబం నుండి వచ్చిన నెహ్రు ఈ దేశం స్వాతంత్రం కోసం జైలు జీ వితం గడిపి దేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజల అభ్యున్నతి కోసం పోరాడారని, మా జీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారని అన్నారు. తొమ్మిదేళ్లపాటు ఫ్యూడల్ వ్యవస్థ నడిపిన భార తీయ రాష్ట్ర సమితిని ఏ విధంగా బొంద పెట్టినామో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను, పథకాలను మార్చాలని చూస్తే బిజెపికి కూడా అదే గతి పట్టి స్తామని హెచ్చరించారు.
నూతనంగా గెలిచి న సర్పంచులు జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరుని కొనసాగిం చాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేసి ప్ర భుత్వానికి పంపాలని పిలుపునిచ్చారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణ మాట్లాడుతూ పేదల నుండి వా రి మనసులో నుండి మహాత్మా గాంధీని దూరం చేయాలనే ఆలోచనతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుం డి గాంధీని బిజెపి ప్రభుత్వం తొలగించిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది ఉ పాధి హామీ కూలీలు ఉన్నారని, ఉపాధి హా మీ పనికి వెళ్లిన ఎంతో మంది కూలీలు గాం ధీ పనికి వెళ్ళమని గర్వంగా చెప్పుకునేవారన్నారు. గాంధీ చరిత్రను మరుగునపెట్టే ప్ర యత్నం బిజెపి కొనసాగిస్తుందన్నారు. సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీ నుం డి మాత్మ గాంధీ పేరు తొలగించి ప్రజలకు గాంధీని శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుందన్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామ గ్రా మాన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వివరించాలని, బిజెపి చేస్తున్న పైశా చికాన్ని ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, కొర్వి అరుణ్ కుమార్, బానోతు శ్రావణ్ నాయక్, మడు పు మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్యా ల సుజిత్ కుమార్, లింగంపల్లి బాబు, వె న్నం రజిత రెడ్డి, కామ్ రెడ్డి రామ్ రెడ్డి, ము త్యం శంకర్ గౌడ్, ఉప్పుల అంజన్ ప్రసాద్, పంజాల స్వామి గౌడ్, అబ్దుల్ రహమాన్, పురుమళ్ళ మనోహర్, ఆకుల ప్రకాష్, దన్న సింగ్,తదితరులు పాల్గొన్నారు.