calender_icon.png 17 September, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాల్లో ఇసుక మేటలు

17-09-2025 01:06:45 AM

  1. చెరువులకు గండ్లు... రైతులకు కడగండ్లు
  2. మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేసినా..నాణ్యత లోపమే
  3. వర్షాకాలం వచ్చిందంటే భయం భయం
  4. ఈ ఏడాది 28 చెరువులకు గండ్లు

నిర్మల్, సెప్టెంబర్ ౧6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సాగునీటి అవసరాల కోసం నిర్మించిన చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో రైతులకు శాపంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు నీరు భూగర్భ జలాల పెంపు పశువులకు నీటి అవసరాల కోసం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువులు నిర్మించిన వాటి నిర్వహణ లేకపోవడంతో చెరువులు తెగి కాల్వల కు గండ్లు ఏర్పడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.

వర్షాలు కురిస్తే చాలు ఏ చెరువు ఎక్కడ తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని నీటి పాదాల శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో 18 మండలాలు ఉండగా 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వర్షపు నీరును నిలువచేసి పంటల సాగు పశువుల దాహార్తి ఇచ్చేందుకు అప్పట్లో పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖ చెరువులను నిర్మించింది.

అయితే ఈ చెరువుల నిర్వహణను ప్రభు త్వం ఇటీవలే పంచాయతీరాజ్ నుంచి నీటిపారుదల శాఖకు బదులాయింపు చేసింది. జిల్లావ్యాప్తంగా 624 చెరువులు ఉండగా వీటిని నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వర్షాలు కురిసి వరదలు వస్తే ఎక్కడ గండిపడి ఏ నష్టం చేకూర్స్తుందని భయం గ్రామ స్తులను ఆందోళనకు గురిచేస్తుంది

మిషన్ కాకతీయ కింద  పనులు చేసిన

నిర్మల్ జిల్లాలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన చెరువుల నిర్వహణపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులను చేపట్టింది . 2018  2019 సంవత్సరాలు రెండు విడుదలగా జిల్లాలోని 240 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి మరమ్మత్తులు చేపట్టారు. ఈ నిధులతో కట్ట వెడల్పు చేయడం ఎత్తు పెంచడం అలుగు రిపేర్ తూము రిపేర్ కాలువల మరమ్మతులు వంటి పనులు చేపట్టినప్పటికీ అవి నాణ్యతగా చేపట్టకపోవ డంతో ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో మొత్తం 28 చెరువులకు గండిపడగా మరో 50 చెరువులు తాత్కాలికంగా బుంగలు లీకేజీలు ఏర్పడడంతో రైతు లు అప్రమత్తమై అలుగు తవ్వకాలు చేపట్టడం ఇసుక బస్తాలతో గండ్లు పూడ్చడంతో మిగతా చెరువులకు ప్రమాదం జరగలేదు. జిల్లాలోని నర్సాపూర్ మండలం దేవుని చెరువు కడ్తాల్ మండలంలోని పెద్ద చెరువు చాక్పల్లి చెరువు అందాపూర్ చెరువు కుబేర్ తానూరు లోకేశ్వరం కుంటాల సారంగాపూర్ తదితర మండలాలు చెరువులకు గండ్లు పడడంతో నీరు మొత్తం ఖాళీ అయిపోయింది.

చెరువు వరద నీరు పంట పొలా లను ముంచెత్తడంతో పంట పొలాల్లో ఇసుకమేటలు వేయడం రహదారిపై ప్రవహిం చడంతో రహదారులు పూత గురికావడం తీవ్ర నష్టాన్ని కలిగించాయి జిల్లావ్యాప్తంగా సుమారు 2000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. 14 చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెరువులు ప్రమాదకరంగా ఉన్నాయని మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు జిల్లా అధికారులకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్న నిధుల లేమితో మరమ్మత్తులు చేపట్టడంతో భారీ నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు.

తెగిపోయిన చెరువులను మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ప్రస్తుతం గండ్లు పూడ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులకు ఈ వాహనాకాలంలో పంటలు కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు పంట పొలాలు కూతకు గురికావడం ఇసుక మేటలు మడ్డిదిబ్బలు పెట్టడంతో వాటిని తొలగించేందుకు అదనంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువుల కింద వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే గండ్లు పడి పంట మొత్తం నాశనం కావడంతో తమ పరిస్థితి ఏం కావాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గండ్లను పూర్తి చెరువులను మరమ్మత్తు చేసి నష్టపోయిన రైతులకు 25000 చెల్లించాలని జిల్లా రైతులు .కోరుతున్నారు.

పెద్ద చెరువుకు పెద్దగండి

నిర్మల్, సెప్టెంబర్ ౧6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో గల పెద్ద చెరువుకు బుధవారం ఉదయం గండిపడి తెగిపోయింది. సోమవా రం రాత్రి భారీ వర్షం కురవడంతో చెరువులోకి వరదనీరురాగా తూము వద్ద లీకేజీ ఏర్పడి పెద్ద బుంగపడి కట్ట తెగిపోయినట్టు ఆయకట్టు రైతులు పేర్కొన్నారు. తూముకు మరమ్మతులు చేపట్టకూడదని కట్ట తెగిపోయిందని రైతులు నీటి పాదాల శాఖ అధికారులకు విన్నవించారు. చెరువు తెగిపోవడంతో వరద నీరు వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులు పేర్కొన్నారు.