calender_icon.png 26 November, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేర్ ఆస్పత్రిలో రోబోటిక్ ఆపరేషన్లు

26-11-2025 12:00:00 AM

-ముగ్గురు మహిళలకు విజయవంతంగా నిర్వహించిన బంజారహిల్స్ శాఖ వైద్యులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో వైద్య బృందం ఒకే రోజు మూ డు సంక్లిష్టమైన రోబోటిక్ గైనకాలజికల్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిం ది. సింగపూర్, దుబాయ్‌తో పాటు మన దేశానికి చెందిన ముగ్గురు మహిళలు చికిత్స పొందారు. ఈ శస్త్రచికిత్సలన్నింటినీ పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఖ్యాతి గన్న రోబోటిక్ సర్జన్ డాక్టర్ మంజుల అనగాని నేతృత్వంలో నిర్వహించారు.

సింగపూర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ సబ్ముకోసల్ ఫైబ్రాయిడ్‌తో (గర్భాశయం లోపలి గదిలోకి ఎది గే మాంసకండ పెరుగుదల) పాటు ఏర్పడ్డ దట్టమైన అతుకుల కారణంగా గర్భాశయ రక్తస్రావంతో బాధపడుతోంది. సమస్య తీవ్ర త పెరగడంతో ఆమె రోబోటిక్ హిస్టరెక్టమీ, బైలేటరల్ సాల్పింగెక్టమీ, అథెసియోలిసిస్ శస్త్రచికిత్సలు చేయించుకుంది.  పోస్ట్-మెనో పాజ్ తర్వాత ఏర్పడే ఎండోమెట్రియల్ హై పర్ప్లాసియాతో బాధపడుతున్న దుబాయ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు రోబోటిక్ హిస్టరెక్టమీతో పాటు బైలేటరల్ సాల్పింగో ఓఫో రెక్టమీ చేశారు.

హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మహిళకు తీవ్రమైన కడుపు నొప్పితో పాటు  పెద్ద అండాశయ రక్తస్రావం తిత్తి, రెం డు వైపులా హైడ్రోసాల్పింగెస్, అంతేకాక మునుపటి ఉదర శస్త్రచికిత్స వల్ల ఏర్పడ్డ దట్టమైన అతుకులు ఆమెను తీవ్రంగా బాధించా యి. ఈ పరిస్థితుల్లో, ఆమెపై వైద్యులు అ త్యంత క్లిష్టమైన, పలుదశల్లో జరిగే రోబోటిక్ శస్త్రచికిత్స చేశారు.   ఈ సందర్భంగా డాక్టర్ మంజుల అనగాని, కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజూ ఎస్. నా యర్ మాట్లాడుతూ  స్త్రీలలో కనిపించే సంక్లిష్టమైన జననేంద్రియ వ్యాధులను రోబోటిక్ సర్జరీ ద్వారా మరింత ఖచ్చితంగా, అతి త క్కువ గాయంతో చికిత్స చేస్తున్నామన్నారు.