calender_icon.png 7 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లో ఆర్‌ఎస్ బ్రదర్స్ కొత్త షోరూమ్

07-11-2025 12:00:00 AM

ప్రారంభించిన సినీ నటి శ్రీలీల

హనుమకొండ టౌన్, నవంబర్ 6 (విజయక్రాంతి): ఆర్‌ఎస్ బ్రదర్స్ వారి మరో సరికొత్త షోరూంను గురువారం వరంగల్ స్టేషన్ రోడ్డులో పాత సునీల్ థియేటర్ కాంప్లెక్స్‌లో ప్రముఖ సినీతార శ్రీలీల ప్రారంభించారు. వరంగల్‌లోని షాపింగ్ ప్రియుల కు ఇది అందమైన కొనుగోలు గమ్యంగా నిలుస్తుందని ఆమె అన్నారు. వ్యాపార రం గంలో ప్రముఖ దార్శనికులైన పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, ది వంగత పి.సత్యనారాయణ సుదూర దృష్టి తో ప్రణాళికాబద్ధంగా నెలకొల్పిన ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థ, సంప్రదాయాన్ని, ఆధునిక ఫ్యాషన్లను మేళవించి భారతదేశ వ్యాప్తంగా కొనుగోలుదారులకు చేరువవుతోంది.

వరంగల్‌లో షోరూమ్‌లో విక్రయానికి అందుబా టులో ఉంచిన వస్త్ర వైవిధ్యంలో కుటుంబంలోని అన్ని తరాల అభిరుచులను ప్రతిబిం బించేలా మహిళలకు, పురుషులకు, పిల్లలకు రూ.149 ప్రా రంభ ధరతో కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. సంస్థ చైర్‌పర్సన్, హోల్ టైం డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ వరంగల్ షోరూమ్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్, పెళ్లి కుమార్తె సంప్రదాయ వస్త్రాలంకరణకు సంబంధించిన సాధికారికమైన పనితనంలోని ప్రత్యేకత గురించి వివరించారు.

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  సీర్ణ రాజమౌళి మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తం గా కొనుగోలుదారుల అభిరుచుల్ని, తాజా ఫ్యాషన్లను ప్రతిబింబించే వస్త్రశ్రేణి తమ వద్ద లభిస్తోందని చెప్పారు. సంస్థ హోల్ టైం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ.. వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఆకర్షణీయమైన ఫ్యాషన్లతో, అందుబాటు ధరలలో ఒకే చోట లభిస్తోందన్నారు.