calender_icon.png 13 January, 2026 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షలు

13-01-2026 12:00:00 AM

  1. విద్యా, ఉద్యోగ, క్రీడల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తాం 
  2. ట్రాన్స్ జెండర్స్‌కూ ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు 
  3. ప్రత్యేక ప్రతిభావంతులకు సూదిని జైపాల్‌రెడ్డి స్ఫూర్తి
  4. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం జీతం కట్
  5. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  6. దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ, ప్రణామ్ వయోవృద్ధుల డేకేర్, బాల భరోసా పథకాలు ప్రారంభం 

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): దివ్యాంగులు ఒకరినొకరు పెళ్లి చేసుకుకున్నా, వీరిని ఇతరులు చేసుకున్నా రూ.2 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యా, ఉద్యోగాలు, క్రీడల్లో దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వారికి సముచిత స్థానం కల్పిస్తామని, వారిని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశా రు. రాష్ర్ట ప్రభుత్వం దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తోందని రూ.50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. సోమ వారం ప్రజాభవన్‌లో దివ్యాంగులకు సహా య ఉపకరణాల పంపిణీ, ప్రణామ్ వయో వృద్ధుల డే కేర్ సెంటర్లు, బాల భరోసా పథ కాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి, మా ట్లాడారు.

దివ్యాంగులు ఆత్మస్థుర్యైం కో ల్పోవద్దని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్‌లో విజయం సాధిం చిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు. ఈ ప్రాంతంలో దివ్యాంగులకు సూదిని జై పాల్‌రెడ్డి స్ఫూర్తి అన్నారు. వైకల్యం ఉందనే ఆలోచనలను కూడా జైపాల్ రెడ్డి రానివ్వకుండా ఉత్తమ పార్లమెంటెరియన్‌గా ఎదిగా రన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రు లను నిర్లక్ష్యం చేస్తే వారి జీతంలో 10- శాతం కోత విధిస్తామని, ఆ డబ్బును  తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తామని సీఎం  తెలిపా రు. ఈ విషయంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేస్తామన్నారు. తహలాల్దార్లు, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేస్తే వారి జీతాల్లో కోత విధిస్తామన్నారు. తల్లిందండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉం దన్నా రు. తల్లిదండ్రులపై బాధ్యత లేనివారికి సమాజంపై ఏం బాధ్యత ఉంటుందన్నారు. 

మన జనగణన మోడల్‌ను కేంద్రం కాపీ

వందేళ్ల తర్వాత తొలిసారి జనగణనతో పాటు కులగణన చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఏడాదిలో కేంద్రం చేస్తున్న జనగణన తెలంగాణ జనగణన మోడల్‌ను కాపీ కొట్టిందన్నారు. రాష్ర్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్యం అందించాలనే ప్రణాళికలను ఈ ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. ఒకప్పుడు ఈ ప్రజాభవన్‌లోకి అడుగు పెట్టేం దుకు ౪ గంటలు ఎదురు చూసినా గద్దర్ రాలేకపోయారు. కొద్దిమంది శ్రీమంతులు, బడా వ్యక్తులకే ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా రావొచ్చు. ధర్మగంట కొట్టవచ్చు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకుంటోందన్నారు. అన్నివర్గాలకు న్యాయం చేయాలన్నదే ప్రభు త్వ లక్ష్యమని అన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఈ ప్రజాప్రభుత్వానికి అండ గా ఉండాలని కోరారు. వర్గీకరణ కారణంగా కొందరిలో అసంతృప్తి ఉన్నా త్వరలో సర్దుకుంటుందన్నారు. ఈ సందర్భంగా దివ్యాం గులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర అత్యాధునిక పరికరాలను ఉచితంగా పంపి ణీ చేశారు. 

మాది మనసున్న ప్రభుత్వం : భట్టి 

మాది మనసున్న ప్రభుత్వమని, అందుకే సమాజంలోని అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపుతూ ముందుకెళ్తోందని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో దివ్యాంగులకు రూ.60 కోట్లు కేటాయిస్తే మా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ.100 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.  ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మా ట్లాడుతూ.. రాష్ర్టవ్యాప్తంగా మంజూరైన 37 ప్రణామ్ డే కేర్ సెంటర్లలో సోమవారం 18 కేంద్రాలను ప్రారంభించామన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల భారీ నిధులను కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. 

కో ఆప్షన్ మెంబర్‌గా ఒక ట్రాన్స్ జెండర్

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్‌గా ఒక ట్రాన్స్ జెండర్‌ను కార్పొరేటర్‌గా నామినేట్ చేయాలని మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అ లాగే మున్సిపాలిటీల్లో కోఆప్షన్ స భ్యులుగా నామినేట్ చేయాలి. ట్రాన్స్‌జెండర్ సమస్యలను వాళ్లే చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామ న్నారు. ట్రాన్స్ జెండర్స్‌కు కూడా ప్ర భుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు.