13-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : గోదావరి నదిపై ఎగువ రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన, వాళ్లు వదిలిన నీటిని పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సో మవారం ఏపీ సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అభ్యంతరంపై స్పందించారు. పోలవరం అద్భుత మైన ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఏపీతో పోటీ పడలేదన్నారు. నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాం తాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నా రు.
ఈ ప్రాజెక్టుతో ఎ వరికీ నష్టం లేదని స్ప ష్టం చేశారు. పోలవరం-నల్లమలసాగర్‌పై తెలంగాణ రాష్ట్రం అ భ్యంతరం చెబుతోందని, కానీ ఆ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టిన ప్పుడు తాను అడ్డు చెప్పలేదని గుర్తు చేశా రు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, ఆ సమయంలో తాము అడ్డుచెప్పలేదన్నారు. గోదావరి, కృష్ణా నదుల నీటిని తెలంగాణ వాడుకున్న తర్వాతే తమ రాష్ర్టం వాడుకుంటుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 87 శాతం పూర్తి అయ్యాయన్నారు. సముద్రంలో కలిసే కొంత నీటిని వాడుకుంటా మని చెబుతున్నామని, పోలవరం పూర్తి అయితే రాష్ర్టంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చంద్రబాబు తెలిపారు.