16-09-2025 12:05:40 AM
ఇండోర్, సెప్టెంబర్ 15: ఇండోర్ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఓ ట్రక్ రో డ్డుపై పయనిస్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. అతి వేగం వల్లే ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కో ల్పోయాడని, పలు వాహనాల మీదకి ట్రక్కు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. సమా చారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.