calender_icon.png 27 December, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిపో గేట్ ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా

27-12-2025 02:11:11 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్26(విజయక్రాంతి): రెబ్బెన మండలం దేవులగూడా వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బులెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో తప్పు లేని ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామారావుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపడం తీవ్ర అన్యాయమని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంఘటనను నిరసిస్తూ శుక్రవారం టీజీఎస్ ఆర్టీసీ డిపో గేట్ ఎదుట ఆర్టీసీ కార్మికులు  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి దివాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన బులె రో వాహనం డ్రైవ్ప చర్యలు తీసుకోకుండా, ఆర్టీసీ డ్రైవర్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడం బాధాకరమని, ఈ విషయంలో డిపో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

కేసును పునఃపరిశీలించి డ్రైవర్ రామా రావుకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఏఐటీయూసీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రఫిక్, తాహెర్ రాజు, హరినివాస్, బాలు, విలాస్ , డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.