calender_icon.png 14 December, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న పోలింగ్ ముగిసే వరకు నియమ నింబంధనలు తప్పనిసరి

13-12-2025 12:00:00 AM

ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,డిసెంబర్ 12(విజయ క్రాంతి): 2వ విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 2వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఈ 14వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగింపు సమ యం మధ్యాహ్నం 1 గంటల వరకు నిశ్శబ్ద కాలం అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు జిల్లాలో జరగనున్న 2వ విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరగనున్న ప్రాంతాలలో పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం నిబంధన అమలులో ఉంటుందని, ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గం టల నుండి 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు సంబంధిత పోలింగ్ ప్రాంతాలలో నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ క్రమంలో బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, సినిమా, టెలి విజన్ టెలివిజన్, సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ఎలాంటి సంగీ త, నాటక, వినోద కార్యక్రమాల రూపంలో ఎన్నికల ప్రచారం చేయకూడదని తెలిపారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 214 (2) ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించడంతో పాటు పోలిం గ్ కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని సమకూర్చి పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ చేసేందుకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు.