14-12-2025 12:32:17 AM
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ
ఖైరతాబాద్, డిసెంబర్ 13 (విజయ క్రాంతి) : రవీంద్ర భారతి వద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ట ప్రతిపాదనను విరామించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ చేసింది. అలాగే ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ తెలంగాణఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ ల ప్రపుల్ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కవులు దాశరధి,సి.నారాయణ రెడ్డి వంటి తెలంగాణ మహనీయుల విగ్రహాలు ప్రతిష్టించకుండా బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ప్రతిష్టిస్తె ఉద్యమకారుల ఆగ్రహాన్ని గురికాక తప్పదని హెచ్చరించారు. జేఏసీ చైర్మన్ సుల్తాన్ యా దగిరి, ప్రసాద్,మోహన్ బైరాగి, జానకి రెడ్డి అనిల్ కుమార్, మల్లు రవి పాల్గొన్నారు.