13-12-2025 12:00:00 AM
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : ఎమ్మెల్యే పదవి నాకు మీరు ఇచ్చిన పదవి, నేనేదో కొనుక్కుంటే వచ్చింది కాదు. ఈ పదవి తో ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇక్కడి ప్రజలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో ఎయిర్ పోర్టు మంజూరు చేయించడం జరిగిందన్నా రు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాంద (టి). జందాపూర్, గూడ, రాంపూర్ తదితర గ్రామా ల్లో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.