calender_icon.png 10 May, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ షాపుల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

10-05-2025 12:52:39 AM

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం, మే 9 (విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ షాప్ ల యజమానులు ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం విజయ క్రాంతిలో ప్రచురితమైన ’మెడికల్ షాపుల మాయాజాలం’ కథనానికి స్పందించిన ఆయన కొత్తగూడెం పట్నంలో పలు మెడికల్ షాపులను తనిఖీ చేశారు.

ఖమ్మం జిల్లా ఔషధ నియంత్రణ సహాయ సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లా ఔషధ నియంత్రణ అధికారితో పాటు, ఖమ్మం జిల్లా ఇన్స్పెక్టర్లు ఈ తనిఖీలు పాల్గొన్నారు. తనిఖీల్లో మెడికల్ షాపుల్లో పలు నిర్వహణ లోపాలు గుర్తించడం జరిగిందన్నారు. మెడికల్ షాప్ యజమానులకు షోకాస్ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.