10-05-2025 12:55:30 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం మే 9 (విజయ క్రాంతి) జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని పరిశ్రమలు సహకరించి అభి వృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఐ డిఓసి కార్యాలయంలో జిల్లాలో ఎ స్సీఏ, ఏ డిపి డిఎంఎఫ్టి టిఆర్‌ఎస్, పిఎంకెఎస్త్వ్ర, ఆర్టికల్ 275, నాబార్డ్, టీ జి ఎఫ్ డి సి నిధుల ద్వారా పురోగతిలో ఉన్న పనులు, చేపట్టను న్న పనులపై జిల్లాలోని (సింగరేణి, కే టి పి ఎస్, బి టి పి ఎస్, నవభారత్, ఐ టి సి, టీ జి ఎఫ్ డి సి) వివిధ పరిశ్రమల ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులతో శుక్రవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కేటాయించిన అన్ని రకాల నిధులను సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధి సాధించాలని అన్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు వారు సి ఎస్ ఆర్ కింద ఎంత నిధులు మంజూరు చేస్తారో మే 15 వ తేది లోగావేదికలు అందించాలన్నా రు. వాటితో జిల్లాలో ఎక్కడ అభివృద్ధి చేయాలి అనేది ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో సిపిఓ సంజీవరావు, వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, మిష న్ భగీరథ ఈ ఈ లు తిరుమలేష్, నలిని, మరియు సింగరేణి, నవభారత్, కేటీపీఎస్, బిటిపిఎస్, ఐటిసి పరిశ్రమల ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.