calender_icon.png 2 September, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నా

02-09-2025 12:43:09 AM

-ఏ పార్టీ నుంచి పోటీ చేయడం లేదు

- మీట్ ది ప్రెస్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

ముషీరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఉప రాష్ర్టవతి ఎన్నికల్లో తాను ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, రాజకీయ పార్టీల అభ్యర్థిని కాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి నుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్ముతున్నానని చెప్పారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తాను తెలంగాణ బిడ్డనని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, తనకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయని, అందరిని ఓటు అడిగే హక్కు ఉన్నదని పేర్కొన్నారు. రాజకీయాలు ముళ్ల కిరీటమని, రాష్ర్టపతి, ఉప రాష్ర్టవతి పదవులు నటులు, రాజకీయాలకు అతీతమని చెప్పారు. 63.7 శాతం మంది ప్రతిపక్షాలు మద్దతు ఉన్నందునే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని వివరించారు. విధులను సక్రమంగా నిర్వహించక పోవడం వల్లనే ప్రజాస్వామ్య పాలన తిరోగమనం అవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ప్రశ్నించడం, విశ్లేషించడం, అధ్యయనం చేయడం మరిచిపోయామని విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ఇంకా సజీవంగా ఉన్నారని, వారి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.