calender_icon.png 23 December, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామమాభివృద్ధే మాకు ముఖ్యం

23-12-2025 12:18:20 AM

-ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు

వెంకటాపూర్, డిసెంబర్22,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన అనంతరం సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ, ఉపసర్పంచ్ అన్నెబోయిన రాజు లు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు 14 వార్డు మెంబర్లు అధికారంగా ప్రమాణ స్వీకారం చేశారు.

గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుగుణ మాట్లాడుతూ.. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధే నా జీవిత లక్ష్యంగా పని చేస్తానని, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం అని తెలిపారు.

అలాగే ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సభ్యుల సమన్వయంతో ప్రతి వార్డులో సమగ్ర అభివృద్ధి చేపడతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామానికి శుభం కలగాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధి ప్రయాణంలో ప్రజలందరి సహకారం అవసరమని నూతన ప్రజాప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.