17-05-2025 01:18:50 AM
మొదటి రోజు అర్ధాంతరంగా ముగిసిన చర్చలు
ఇస్తాంబుల్, మే 16: తుర్కియే వేదికగా రష్యా-ఉక్రెయిన్ మధ్య శుక్ర వారం శాంతి చర్చలు మొదలయ్యా యి. అయితే మొదటి రోజు చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. రష్యా తాము ఆమోదించలేని డిమాండ్లను ప్రతిపాదిస్తోందని ఉక్రెయిన్ తరఫున హాజరైన వారు ఆరోపించారు. ఈ శాంతి చర్చలకు తుర్కియే మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఉక్రెయిన్ తరఫున రక్షణ శాఖ మంత్రి రుస్తెమ్ ఉమెరోవ్ నేతృత్వంలో బృందం పాల్గొనగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి బృందం పాల్గొంది.