17-05-2025 01:16:51 AM
వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
న్యూఢిల్లీ, మే 16: భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ నెల 18వరకు కొనసాగించాలని భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీ వ్ ఘాయ్- పాక్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ నిర్ణయానికొచ్చినట్టు పాక్ విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఇషాక్ దార్ గురువారం వెల్లడించా రు. రెండు దేశాల డీజీఎంవోల మధ్య హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిగాయి. అదే రోజు రెండు దేశాల డీజీఎంవోల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. పాక్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఇషాక్ దార్ ఈ వివరాలు వెల్లడించారు.