21-11-2025 12:00:00 AM
సీఎంగా టర్మ్ పూర్తి కాలం ఉంటే దేశంలోనే రికార్డ్
27మంది మంత్రులతో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్
ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు
అంకితభావం కలిగిన నేతలతో బీహార్ ఉన్నత శిఖరాలకు.. : ప్రధాని మోదీ
పాట్నా, నవంబర్ 20: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సింది. రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ పదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయ నతో పాటు బీజేపీకి చెందిన సామ్రాట్ చౌ దరి, విజయ్‌కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా పలువురు మంత్రులతో రాష్ట్ర గవ ర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణం చే యించారు.
ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ పూర్తి కాలం ఉంటే సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవవన్ చామ్లింగ్ (24 సంవత్స రాలు) రికార్డును అధిగమించి దేశంలోనే అతి ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి గా ఆయన రికార్డుల్లోకి ఎక్కనున్నారు. నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధా ని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజర య్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఘన విజయంతో..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల కు గాను నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 202 సీట్లను దక్కించుకుని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 101 సీట్లలో పోటీచేసి 89చోట్ల గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఆ తర్వాత జేడీయూ 101సీట్లలో పోటీ చేసి 85 స్థానాల్లో విజయం సాధించింది. నితీశ్‌తో సహా 27మంది మంత్రు లుగా ప్రమాణం చేశారు. వారిలో 14మంది బీజేపీ నుంచి, 9మంది జేడీయూ నేతలు, లోక్ జనశక్తి (రాంవిలాస్)నుంచి ఇద్దరు, రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) హిం దూస్థాని అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం)నుం చి ఒక్కొక్కరికి మంత్రి పదవులు దక్కాయి.
మంత్రులుగా ప్రమాణం చేసింది వీరే..
(బీజేపీ నుంచి14మంది, చిరాగ్ పార్టీ నుంచి 2) సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా, దిలీప్ జైస్వాల్, మంగళ్ పాండే, రామ్‌కృపాల్ యాదవ్, సంతోష్ సుమన్, నితిన్ నబిన్, సంజయ్ సింగ్ టైగర్, అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతా, నారాయణ ప్రసాద్, రామ నిషాద్, లఖేంద్ర కుమార్ రోషన్, ప్రమోద్ కుమార్, సంజయ్‌కుమార్, సంజయ్‌కుమార్ సింగ్, దీపక్ ప్రకాశ్, జేడీయూ నుంచి 9మంది విజయ్‌కుమార్ చౌదరి, బీజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్‌కుమార్, అశోక్ చౌదరి, లేషిసింగ్, మహ్మద్ జమాఖాన్, మదన్ సాహ్ని, సునీల్‌కుమార్‌తో పాటు, ఆర్‌ఎల్‌ఎం, హెచ్ ఏఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేశారు.
మంత్రులకు ప్రధాని శుభాకాంక్షలు
బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్ర మాణ స్వీకారం చేసిన వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇది అద్భుతమైన టీమ్.. అంకి తభావం కలిగిన నాయకులు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా’ అని ప్రధాని ఎక్స్‌లో రాసుకొచ్చారు.