17-01-2026 01:16:21 AM
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
గోదావరిఖని, జనవరి,16(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్ర జల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రా రంభించిన ఆర్రైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మార్గదర్శకత్వంలో, డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం ట్రాఫిక్, గోదావరిఖని 1- టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో రామగుం డం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, విద్య, రోడ్డు రవాణా, ఆరోగ్య, ఆర్ అండ్ బి శాఖ, తదితర శాఖల అధికారులు, ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీతో పాటు అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి డీసీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఆర్రైవ్- అలైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమన్వ యం చేస్తున్నామన్నారు. రామగుండం పోలీ స్ కమిషనరేట్ పరిధిలో ఏడాది 30 శాతం ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా ము న్సిపల్, విద్య, ఆరోగ్య, రోడ్డు రవాణా, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ యాదవ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని 1- టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎంఈ ఓ మల్లేష్, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. కృపా భాయ్, అసిస్టెంట్ మోటా ర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ సాగర్, రోడ్లు & భవనాల శాఖ డిఈ జాఫర్, ఆర్ టిసీఏడిఎం రామగుండం, ఎస్‌ఐ రమేష్, అనూష, ట్రాఫిక్ ఎస్ ఐలు హరిశేఖర్, రామరాజు, వి విధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.