calender_icon.png 17 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుద్రంగిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం

17-01-2026 01:18:19 AM

  1. నూతన ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మిస్తాము
  2. అన్ని వసతులు కల్పిస్తాము
  3. త్వరలో ఏటీసీ పనులు ప్రారంబిస్తాము : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జనవరి 16 (విజయ క్రాంతి): రుద్రంగిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రు ద్రంగి మండల కేంద్రంలో సర్వ శిక్ష నిధులు రూ. 48. 60 లక్షల నిధులతో మండల రిసో ర్స్ భవనం ఎంఆర్సీ నిర్మించగా, శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రారంబించారు. అనంతరం గ్రా మ పంచాయతీ భవనం ఆవరణలో 21 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ము బారక్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్బం గా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు.

రుద్రంగిలో పలు ప్ర భుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనాన్ని త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇ చ్చారు. స్థానికుల కోరిక మేరకు క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలోని యువత, విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి, ఉపాధి పొందేందుకు శిక్షణ అందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోసం రూ. 42 కోట్లు మంజూరు చేసిందని, టెండర్లు పూర్తి అయ్యాయని త్వరలోనే పనులు మొదలు పెడుతామని తెలిపారు. టాటా కంపెనీ సహకారం, బాగస్వామ్యంతో దీనిలో మొత్తం ఆ రు కోర్సులు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

మార్క్ ఫెడ్ ఆద్వర్యంలో గో దాం నిర్మాణానికి స్థలం గుర్తిసున్నామని, దా ని పనులు ప్రారంబిస్తామని చెప్పారు. వేములవాడ నియోజకవర్గంలో రుద్రంగి రెండో అతి పెద్ద గ్రామమని తెలిపారు. విశాలమైన రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ని యోజకవర్గం అభివృద్దికి అన్ని విధాలా స హకరిస్తున్నారని తెలిపారు. కలికోట-సూర మ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో పరిహారం పంపిణి చేస్తామని ప్రకటించారు.

ప్ర భుత్వ భూములను ప్రభుత్వ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని, కబ్జాలో ఉన్న భూ మి లేని అర్హులైన నిరుపేదల భూములు తీసుకోమని స్పష్టం చేసారు. ఎల్లంపల్లి ప్రా జెక్ట్ నుంచి నియోజకవర్గానికి త్వరలోనే సాగు నీటిని విడుదల చేయిస్తానని తెలిపా రు.132/33 సబ్ స్టేషన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, విద్యుత్ సమస్యలు లేకుం డా చేస్తామని భరోసా ఇచ్చారు.కార్యక్రమం లో సర్పంచ్ నారాయణ,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,మార్కెట్ కమిటి చైర్మెన్ చేలు కల తిరుపతి, వేములవాడ ఆర్డీఓ రాదాభా యి, డీఈఓ వినోద్ కుమార్, టీజీ ఈడబ్ల్యూ ఐడీసీఈఈ అశోక్ కుమార్, డీఈ సత్యనారాయణ, తహసిల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.