calender_icon.png 10 August, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ సర్జరీల్లో భద్రత ముఖ్యం

10-08-2025 12:51:28 AM

  1. రోగుల సంరక్షణకే పెద్దపీట వేయాలి
  2. ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం ముఖ్యం
  3. ఉన్న అందాన్ని చెడగొట్టేలా ఉండకూడదు
  4. సేఫ్‌ప్లాస్2025 సదస్సులో సీనియర్ వైద్యుల సూచనలు
  5. టీ ప్రారంభమైన రెండు రోజుల సదస్సు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ప్లాస్టిక్, ఈస్థటిక్ సర్జరీలు చాలా సంక్లిష్టమైనవని, అలాంటి సర్జరీల్లో భద్రత ఎంతో ముఖ్యమని దుబాయ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ పరాశర్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో మనం నూటికి నూరు శాతం కృషి చేసినా ఫలితాలు మాత్రం అలా ఉండకపోవచ్చని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం అవసరమని సూచించారు.

నగరంలోని టీ వేదికగా రెండురోజుల పాటు నిర్వహించే సేఫ్ ప్లాస్ట్ సదస్సు శనివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 120 మందికి పైగా ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులతోపాటు విదేశాల నుంచి ఆన్‌లైన్‌లో కూడా కొందరు పాల్గొన్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 25 మంది సీనియర్ ప్లాస్టిక్ సర్జన్లు వివిధ అంశాలపై మాట్లాడి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డా.సంజయ్ పరాశర్ మాట్లాడుతూ అసలు ప్రక్రియ ఎలా చేయాలన్నది తగినంత శిక్షణ లేకుండా కేవలం పుస్తకాలు చూసి చేసేయడం కూడా సరికాదని సూచించారు. పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత చేస్తే మాత్రమే రోగులకు అత్యంత సురక్షితంగా చికిత్స చేయగలమని, మిగిలిన విభాగాలలో చేసే చికిత్సలు వేరు, ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు చేసే చికిత్సలు వేరు అని తెలిపారు. చికిత్స చేసిన తర్వాత ఏదో ఒక కారణంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని, అవి రాకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు. 

డాక్టర్ల ప్రొఫైల్ చూడాలి

పెర్సానిక్స్ కాస్మొటిక్స్, ప్లాస్టిక్ సర్జరీ సె ంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురుకర్ణ వే ముల మాట్లాడుతూ ఈ రకమైన చికిత్సలు చేయించుకునే వారు డాక్టర్ల ప్రొఫైల్, వెబ్‌సైట్లు, రాష్ర్ట స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లాంటివాటిలో రిజిస్ట్రేషన్లు పరిశీలించాలని సూచించారు. ఈస్థటిక్ సర్జరీల గు రించి మన దేశంలో ఇంకా శిక్షణ మెరుగుపడాలని, శిక్షణ కార్యక్రమాలు పెంచాలన్నారు.

బొటాక్స్, ఫిల్లర్స్, లేజర్స్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ లాంటి చికిత్సలను అత్యంత సురక్షితంగా చేయాలని, ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాల ని చెప్పారు. ఈ రంగంలో ఉన్న అత్యుత్తమ వైద్య నిపుణులు తమ అనుభవాలను పాఠాలుగా చెబుతున్నందున వీటి నుంచి నే ర్చు కుంటే ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు తమ వృత్తి జీవితంలో రాణించగలరన్నారు.