10-08-2025 12:52:49 AM
కేసముద్రంలో నిలిచిన వందే భారత్, ఇంటర్ సిటీ రైళ్లు
మహబూబాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): విజయవాడకాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య శనివారం రాత్రి 8 గంటల సమయంలో కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో గుంటూరు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీని కారణంగా విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు గంటపాటు అంతరాయం కలిగింది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కేసముద్రం రైల్వే స్టేషన్‌లో సుమారు 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎయిర్ వ్యాక్యూమ్ (గ్యాస్) పైపుకు సంబంధించిన సమస్య తలెత్తడంతో 420 కిలో మీటరు వద్ద నిలిచిపోయింది.
రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది సాంకేతిక సమస్యను గుర్తించి లోపాన్ని సరి చేయడంతో రాత్రి 9:45 ప్రాంతంలో రైలు బయలుదేరింది. ఆ తర్వాత వందే భారత్ రైలు కూడా కేసముద్రం నుంచి సికింద్రాబాద్ వెళ్లిపోయింది. ప్రయాణికులు దాదాపు గంట పాటు ఇబ్బందులు పడ్డారు.