calender_icon.png 22 July, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ జలాలు వెంటనే విడుదల చేయాలి..

22-07-2025 12:00:00 AM

రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి

ఖమ్మం, జులై 21 (విజయ క్రాంతి): సాగర్ ఆయకట్టు లో వరి నాట్లు పూర్త చేయుటకు సాగర్ జలాలు విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం లో పోతినేని మాట్లాడుతూ ఖ మ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు రైతులు సాగర్ జలాలు వస్తాయనే ఆశతో వర్షలకు వరి నారుమళ్లు పోసి నాట్లు వేయటం కు సిద్ధం అవుతున్నారన్నారు.

సకాలంలో సాగర్ జలాలు విడుదల చేసి వానాకాలం వరి పంట సాగర్ ఆయకట్టు లో పండించేందుకు జిల్లా మంత్రులు మరియు జిల్లా కలెక్టర్ ఇతర ఇరిగేషన్ అధికారులు తక్షణమే చోరవ చూపాలన్నారు. పంటల సీజన్ ప్రా రంభం అయినందున జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

సొసైటీలలో యూరియా నిల్వలేకపోతే రైతులు ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సిండి కేట్గా మారి కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తారు. దీని వల్ల సరైన సమయంలో పంటలకు యూరియా వేయలేని పక్షంలో పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. కావున ప్రభుత్వం ఈ అంశాలనీతిని పరిగణలోకి తీసుకొని సకాలంలో అవసరమైన మేరకు రై తులకు యూరియా అందుబాటు లో ఉండేలా చూడాలన్నారు.

అధికారులకు వస్తే అర్హులైన పే దలందరికీ ఇండ్లను ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ హామీ అమలులోకి వచ్చేసరికి గ్రామాల్లో కొద్దిమంది కి మాత్రమే ఇండ్లను కేటాయించి వందలాది మది లబ్ధిదారులను వదిలేసిందన్నారు. అ వి కూడా రాజకీయ జోక్యంతో అధికార పార్టీక చెందిన నేతలు వారి యొక్క అనుచర వర్గాలకు ఇండ్లను కేటాయింపు చేసుకుంటున్నారని వారన్నారు.

ఇండ్ల కేటాయింపులు రాజకీయ జోక్యం సరికాదన్నారు. ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చే యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్,కళ్యాణ వెంకటేశ్వరరావు, వై విక్రమ్, బండి పద్మ బొంతు రాంబాబు, మాదినేని రమేష్, శ్రీనివాసరావుతో పాటు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు హాజరైనారు.