calender_icon.png 9 August, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంగిన డ్రైనేజీ ట్రంక్ లైన్

09-08-2025 01:04:05 AM

- హయత్నగర్ జాతీయ రహదారిపై వీరభద్ర కాలనీ ప్రధాన రోడ్డులో భారీ గుంతను 

- పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులు

ఎల్బీనగర్, ఆగస్టు 8 : గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హయత్ నగర్ లోని జాతీ య రహదారిపై భారీ గుంత ఏర్పడింది. వీరభద్ర కాలనీ ముఖద్వారం వద్ద ఉన్న 1200 ఎంఎం డయా భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పగిలిపోవడంతో రోడ్డులో కుంగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులతో కలిసి ట్రంక్ లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.

పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వీస్ రోడ్లకు ఆనుకొని ఉన్న కాలనీలకు బీటీ రోడ్డు అనుసంధానం లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంద న్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను పరిశీలించి నివేదిక అందించాలని కోరారు.

వ ర్షాకాలంలో ప్రమాదాలు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, హైడ్రా, విద్యుత్ శా ఖ తదితర విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మే రకు డ్రైనేజీ లైన్లు, వరదనీటి కాలువలు, విద్యుత్ స్తంభాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగొని శ్రీధర్ గౌడ్, నాయకులు భాస్కర్ సాగర్, గుడాల మల్లేష్, జాతీయ రహదారుల డీఈ బాలు నాయక్, వాటర్ వరక్స్ డీజీఎం రాజ్ గోపాల్, అధికారులుపాల్గొన్నారు.